HomeTelugu Newsకరోనాపై జొన్నవిత్తుల పేరడి సాంగ్‌

కరోనాపై జొన్నవిత్తుల పేరడి సాంగ్‌

14 5
భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య రోజూరోజూకూ పెరుగుతోంది. కరోనా పేరు వినబడితే చాలు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ అంతకంతకూ వ్యాప్తి చెందుతున్న వేళ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా వచ్చి తమకు చేతనైన సాయం చేస్తున్నారు. కొంతమంది విరాళాలు ఇస్తుంటే మరికొంత మంది వివిధ వీడియోలు, పాటలు, ప్రసంగాలతో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇటీవల కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పాటను రూపొందించారు కోటి. తాజాగా గేయ రచయిత జొన్నవిత్తుల కూడా ఓపాటను రచించి ఆయనే స్వయంగా పాడారు. ”వచ్చారో సచ్చారే బయటకి.. మీరు వచ్చారో సచ్చారే బయటకి, కనుక గడప దాటి రావద్దు దేనికి” అంటూ ఆయనే స్వయంగా పాడి విడుదల చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu