బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు జోథ్‌కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కృష్ణజింకను వేటాడిన కేసులో తదుపరి కోర్టు విచారణకు హాజరుకాకపోతే.. ఆయన బెయిల్‌ను రద్దు చేస్తామని తేల్చి చెప్పింది. కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్‌కు జోథ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు. జోథ్‌పూర్ కోర్టు గురువారం ఈ కేసు విచారణను చేపట్టింది. ఈ విచారణకు సల్మాన్ హాజరు కావాల్సి ఉండగా.. ఆయన కోర్టుకు రాలేదు. దీంతో కోర్టు సల్మాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
1998లో హమ్ సాథ్ సాథ్ హై చిత్ర షూటింగ్ సందర్భంగా రాజస్థాన్ జోథ్‌పూర్‌లో కృష్ణజింకలను వేటాడి చంపినట్టు సల్మాన్ ఖాన్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో గత ఏడాది సల్మాన్‌ను దోషిగా నిర్ధారిస్తూ.. జోథ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.