Jio Hotstar Merge:
జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ విలీనం భారతదేశ OTT మార్కెట్‌లో పెనుమార్పులు తెస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే, ఢిల్లీకి చెందిన ఒక సాంకేతిక నిపుణుడు “JioHotstar” అనే డొమైన్ పేరును ముందుగానే కొనుగోలు చేయడం వల్ల ఈ విలీనంలో కొన్ని చిక్కులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
ఈ డొమైన్ ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికారులకు ఓ లేఖతో కూడిన వెబ్‌సైట్‌గా ఉంది. ఆ వెబ్‌సైట్ యజమాని ఒక యాప్ డెవలపర్ కి తన విద్య కోసం సహాయం చేయాలని కోరుతున్నాడు. అతను కెంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఎగ్జిక్యూటివ్ MBA కోర్సు చేయడానికి అవసరమైన రూ.1 కోటి వరకు ఖర్చును భరించాలని రిలయన్స్‌ను అభ్యర్థించాడు.
అయితే, రిలయన్స్ కార్యనిర్వాహకుడు అంబుజేష్ యాదవ్ ఈ అభ్యర్థనను తిరస్కరించడమే కాకుండా, డొమైన్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకునే సూచన కూడా ఇచ్చారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, చాలామంది ఢిల్లీ డెవలపర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.
వారు రిలయన్స్ అతని విద్యను సమర్థించాలని, అది కంపెనీ ఖర్చుతో పోల్చితే తక్కువే అని చెబుతున్నారు. మరి రిలయన్స్ వారు తమ నిర్ణయంలో మార్పు చేస్తారో లేదో చూడాలి.
Read More: Anushka వచ్చే ఏడాది రెండు సినిమాల్లో కనిపిస్తుందా?