Jigarthanda Double X: తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన జిగర్ తండ డబుల్ ఎక్స్ మూవీకి అరుదైన గౌరవం దక్కింది. నెదర్లాండ్స్‌లోని రోటర్‌డ్యామ్ 50వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ఈ చిత్రం ఎంపికైంది.
ఈ చిత్రంలో రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు. 2014లో వచ్చిన ‘జిగర్ తండ’ మూవీకి ఇది సీక్వెల్‌గా నిర్మించారు. గత నెలలో రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. హాలీవుడ్ దిగ్గజ నటుడు క్లింట్ ఈస్ట్‌వుడ్‌కు వీరాభిమాని అయిన దర్శకుడు సుబ్బరాజు ఈ మూవీలో క్లింట్ యానిమేషన్ పాత్రను సృష్టించాడు. ఇది సినిమాకే హైలెట్‌గా నిలిచింది.
‘జిగర్‌తండ డబుల్‌ఎక్స్’ చిత్రం ప్రతిష్ఠాత్మక రోటర్‌డ్యామ్ ఫిలిం ఫెస్టివల్‌లో లైమ్‌లైట్ కేటగిరీ కింద ప్రదర్శించడానికి ఎంపికైందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం అంటూ దర్శకుడు సుబ్బరాజు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ వేడుక వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ఫిబ్రవరి 4 వరకు జరగనుంది.
‘జిగర్‌తండ డబుల్‌ఎక్స్’ మూవీతో పాటు ఈ ఫిలిం ఫెస్టివల్‌కు ఇండియా నుంచి మరో తమిళ సినిమా ‘ఏళు కడల్.. ఏళుమలై’ కూడా ఎంపికైంది. ఈ సినిమాలో తెలుగు నటి అంజలి, మలయాళ నటుడు నివిన్ పాలీ ప్రధాన పాత్రలో నటించారు.
Very Happy and Excited to share that our #JigarthandaDoubleX is officially selected at and will have its Dutch Premiere at the prestigious @IFFR – Rotterdam Film Festival under the Limelight Category. @offl_Lawrence @iam_SJSuryah @dop_tirru @Music_Santhosh @kaarthekeyens… pic.twitter.com/vrR3Hg5acO
— karthik subbaraj (@karthiksubbaraj) December 21, 2023