HomeTelugu Trendingసల్మాన్ ఖాన్‌పై జియాఖాన్ తల్లి ఆరోపణలు

సల్మాన్ ఖాన్‌పై జియాఖాన్ తల్లి ఆరోపణలు

6 17
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ పై దివంగత నటి జియాఖాన్ తల్లి రబియా అమిన్ తీవ్ర ఆరోపణలు చేసింది. తమకు సల్మాన్ చాలా అన్యాయం చేశారని ఆమె అన్నారు. 2015లో జియాఖాన్ అనుమానాస్పద రీతిలో చనిపోయింది. ఈ కేసులో బాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్ పంచోలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే తన కుమార్తె ఆత్మహత్య దర్యాప్తును సల్మాన్‌ దెబ్బ తీశాడని.. సూరజ్‌ పంచోలిని కాపాడటం కోసం సల్మాన్‌ తన పేరు, డబ్బును ఉపయోగించాడని అన్నారు రజియా. ఈ విషయాన్ని సీబీఐకి చెందిన ఓ అధికారి తనకు చెప్పారని తెలిపారు. సల్మాన్ తనకు ప్రతిరోజు ఫోన్ చేసే వాడని… సూరజ్ పంచోలిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేవాడని సదరు అధికారి తనతో చెప్పారని ఆమె వెల్లడించారు. మరణానికి ముందు సూరజ్ పంచోలితో జియాఖాన్ ప్రేమలో ఉంది. ఆ తరుణంలో ఆమె అనుమానాస్పదంగా చనిపోయింది. ఆమె చావుకు సూరజ్ పంచోలీనే కారణమని ఆరోపణలు చాలానే వచ్చాయి.

6a 4

Recent Articles English

Gallery

Recent Articles Telugu