గత కొంతకాలంగా శ్రీదేవి కూతురు జాన్వీ వెండితెరకు పరిచయం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు. శ్రీదేవికి మాత్రం తన కూతురిని అప్పుడే హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయడం ఇష్టంలేక ఎంతమంది దర్శకనిర్మాతలు అడిగినా ఆఫర్స్ అన్నీ రిజక్ట్ చేస్తూ వస్తోంది.
తాజాగా ఆమె కరణ్ జోహర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నాలుగేళ్ల క్రితం కరణ్ జోహర్ రూపొందించిన
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా కు ఇప్పుడు సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా సారా అలీఖాన్ ను ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు కరణ్ జోహర్.
అయితే దానికి ఆమె తల్లి అమృత నిరాకరించింది. దీంతో ఈ సీక్వెల్ సినిమా ద్వారా జాన్వీ ను పరిచయం చేస్తే బావుంటుందని శ్రీదేవిని సంప్రదించగా.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లో అలియాభట్ ను ప్రెజంట్ చేసిన తీరు నచ్చడంతో శ్రీదేవి కూడా కరణ్ కు ఓకే చెప్పిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. దీంతో జాన్వీ ఎంట్రీ ఈ సినిమాతో ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.