బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి పెదకూతురు జాన్వీకపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన లైఫ్ ని సరదాగా స్పెండ్ చేసేందుకు ఆసక్తిగా ఉంటుంది. ఇన్ స్టాలో తన వృత్తిగత వ్యక్తిగత వ్యవహారాల్ని షేర్ చేసే విధానం దీనిని ఆవిష్కరిస్తుంది. తాజాగా జాన్వీ తన చేతిలో స్టార్ బక్స్ డ్రింక్ తో పోజులిచ్చిన ఫోటోని షేర్ చేసింది.వర్క్ ఫ్రమ్ హోం కాన్సెప్ట్ బోరుగా ఫీలవుతుంది. ఇటీవలే జాన్వీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన స్టిల్ నే ఉదాహరణగా చెప్పొచ్చు. వైట్ ఫుల్ కోటును వేసుకున్న జాన్వీ లాప్టాప్ ముందు చేతిలో స్ట్రా గ్లాస్ ను పట్టుకుని కూర్చుని డల్‌గా కనిపిస్తుండటం ఫొటోలో గమనించవచ్చు. ‘వర్క్‌ఫ్రమ్ హోం చాలా ఫన్నీగా ఉంటుందని వాళ్లు చెప్పారు..’ అంటూ తనకైతే ఆసక్తిలేనట్టుగా కనిపిస్తున్న ఇమేజ్‌కు క్యాప్షన్ ఇచ్చింది. వరుస ప్రాజెక్టులతో బిజీ. దోస్తానా 2 లో కార్తీక్ ఆర్యన్ – లక్ష్ లాల్వానీలతో పాటు నటిస్తోంది. రాజ్ కుమార్ రావుతో రూహి అఫ్జానా రిలీజ్ కావాల్సి ఉంది. కరణ్ జోహార్ తఖ్త్ లో జాన్వి కూడా ఓ కీలక పాత్రను పోషిస్తోంది. తన తదుపరి చిత్రం `గుడ్ లక్కీ జెర్రీ` పంజాబ్ లో చిత్రీకరణలో ఉంది.