అందాల తార స్వర్గీయ శ్రీదేవీ ముద్దుల తనయగా వెండితెరకు పరిచయమైంది జాన్వీ కపూర్. మొదటి సినిమా ధడక్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా.. జాన్వీ లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక ఫస్ట్ మూవీ ఫలితం ఎలాగున్నా బాలీవుడ్ లో జాన్వీ ఫాలోయింగ్ బాగానే ఉంది. జాన్వీ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలకు రెడీ అవుతూ ఉంది.
జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోలు, పొట్టి దుస్తుల్లో కెమెరా కళ్లకు చిక్కుతూ సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తాజాగా జాన్వీ బెల్లీ డ్యాన్స్ చేస్తూ ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అభిమానులు ఊరికే ఉంటారా? లైక్‌లు, కామెంట్లతో ఈ వీడియోను షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటివరకు 3లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. జాన్వీ ప్రస్తుతం ‘తక్త్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.