HomeTelugu Newsఫిట్‌నెస్‌ బోధకురాలుకే ట్రైనింగ్‌ ఇస్తున్న జాన్వీ

ఫిట్‌నెస్‌ బోధకురాలుకే ట్రైనింగ్‌ ఇస్తున్న జాన్వీ

11 12ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌ ఫిట్‌నెస్‌ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అంతేకాకుండా ఆమె ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఎన్నో వర్కౌట్ వీడియోలను తరచూ సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటుంటారు. తాజాగా ఈ బ్యూటీ తన ఫిట్‌నెస్‌ బోధకురాలు నమ్రత పురోహిత్‌కే ట్రైనింగ్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను నమ్రత ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘మా కొత్త ఫిట్‌నెస్‌ బోధకురాలు జాన్వీకపూర్‌. తను చెప్పిన విధంగా మేము వర్కౌట్స్‌ చేశాం. తను మమ్మల్ని మెచ్చుకున్నారు.’ అని నమ్రత పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై స్పందించిన జాన్వీకపూర్‌ ‘ప్రతిరోజూ నేను రోజంతా క్లాస్‌ తీసుకుంటాను.’ అని తెలిపారు.

ప్రస్తుతం జాన్వీకపూర్‌ ‘దోస్తానా 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ.. కార్తీక్‌ ఆర్యన్‌కు జంటగా కనిపించనున్నారు. దీనితోపాటు జాన్వీ ‘గుంజన్‌ సక్సేనా ది కార్గిల్‌ గర్ల్‌’ చిత్రంలో నటిస్తున్నారు. మొట్టమొదటి వాయుసేన మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న సినిమా ఇది. 1990లో కార్గిల్‌ యుద్ధ సమయంలో గాయపడిన సైనికులను తన విమానంలో ఎక్కించుకుని సురక్షింతంగా తీసుకువచ్చిన మహళ గుంజన్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu