టాలీవుడ్ హీరో రాజశేఖర్ కుటుంబం ఇటీవలే కరోనా బారిన పడింది. హైదరాబాదులోని సిటీ న్యూరో ఆసుపత్రిలో రాజశేఖర్ చికిత్స పొందుతున్నారు. జీవిత హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నారు. రాజశేఖర్ కు వైద్యులు ప్లాస్మా థెరపీ ఇచ్చారు. మరోపక్క రాజశేఖర్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజశేఖర్ ఆరోగ్యంపై జీవిత స్పందించారు. ఆయనకు ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నారని చెప్పారు. గత మూడు రోజులుగా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని… 80 శాతం ఇన్ఫెక్షన్ తగ్గిందని తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆయన ఐసీయూ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రాజశేఖర్ ఆరోగ్యం గురించి తాము ప్రతిరోజు వైద్యులతో మాట్లాడుతున్నామని తెలిపారు.