‘మా’ ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్లో మాటల యుద్ధం జరుగుతుంది. ప్రకాశ్ రాజ్ ప్యానల్ లోకి జీవిత రావడంతో ఆ ప్యానల్ నుంచి బండ్ల గణేశ్ బయటకు వచ్చారు. జీవితపై ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఆయన తెలిపారు. అంతేకాదు, మెగా ఫ్యామిలీని జీవిత ఎన్నోసార్లు కించపరిచారంటూ వివాదాన్ని రాజేశారు. బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై జీవిత కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.
‘మా’ ఎన్నికల గురించి కాకుండా.. చిరంజీవి ఇష్యూపై మాట్లాడాల్సిన అవసరం ఏముందని ఆమె ఫైర్ అయ్యారు.. బండ్ల గణేశ్ అంటే తనకు డోంట్ కేర్ అని… ఆయన గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అని అన్నారు. తన బతుకు గురించి ఆయనకు ఏం అవసరమని… తాను పార్టీలు మారితే ఆయనకు వచ్చిన కష్టమేమిటని మండిపడ్డారు. పార్టీలు మారడం తన ఇష్టమని చెప్పారు. మెగా ఫ్యామిలీని ఎంతో మంది విమర్శించి ఉంటారని… వాళ్లందరినీ వెలి వేస్తారా? అని ప్రశ్నించారు. తమ ఆస్తులను అమ్ముకుని చేతనైనంత మందికి సాయం చేశామని చెప్పారు.