జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన రాజీనామా లేఖనుకు పంపారు. పవన్‌లో నిలకడైన విధివిధానాలు లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ తన పూర్తి జీవితం ప్రజాసేవకే అకింతం అని… ఇక సినిమాల్లో నటించనని గతంలో అనేక పర్యాయాలు వెల్లడించారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయం మార్చుకోవడంతో ద్వారా పవన్‌లో నిలకడైన విధివిధానాలు లేవని తెలుస్తోంది. కావున నేను జనసేన పార్టీ కి రాజీనామ చేస్తున్నట్లు లక్ష్మీనారాయణ తన లేఖలో వెల్లడించారు.
”ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు, ఓటు వేసిన ప్రతి ఓటరుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వ్యక్తిగత స్థాయిలో జనసైనికులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు, పౌరులకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ వారందరికీ.. మీకు, మీ కుటుంబసభ్యులకు ఎప్పుడూ మంచి జరగాలని.. భగవంతుడి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.. అని లక్ష్మీనారాయణ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో లక్ష్మీనారాయణ విశాఖ లోక్‌సభా స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే.