టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఆ పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయి విమర్శలు చేశారు . రాజధాని అమరావతి తాత్కాలికం, తాత్కాలికం అంటూ చంద్రబాబు పిచ్చి పని చేశారని మండిపడ్డారు. అమరావతిని అత్యున్నతస్థాయి లో నిర్మించాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు చేసిన పనిని వైసీపీ ప్రభుత్వం మరో రకంగా ఉపయోగించుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిని ముక్కలు చేస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం చేస్తామన్నారు. రాజధాని కావాలంటే కడపలోనో , పులివెందుల లోనో పెట్టుకోవాలని, విశాఖ రాయలసీమ వాసులకు చాలా దూరం అవుతుందని అన్నారు. అమరావతికి సెక్రటేరియట్ లేకుండా చేసి , రాయలసీమకు హైకోర్టు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని.. దానివల్ల ఓ 10 జిరాక్స్ షాపులు వస్తాయని అంతకంటే లాభం ఉండదని అన్నారు.
రాజధాని మార్పు వైసీపీ నేతలు అనుకుంటున్నంత సులభం కాదని జేసీ అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేశారు. అమరావతిలో ప్రస్తుతమున్న భవనాలతో రూపాయి ఖర్చు లేకుండా మరో పదేళ్లు నడిపించవచ్చునని చెప్పిన జేసీ అన్నారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూనే , చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్లే ఇదంతా జరిగిందని, రాజధానిని తాత్కాలికం అనడం పిచ్చిపని అని
అన్నారు.