టైగర్‌ నాగేశ్వర రావు: జయవాణి ఫస్ట్‌లుక్‌

రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వర రావు’. వంశీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ 1970స్‌ కాలంలో స్టూవర్ట్‌పురం పాపులర్‌ దొంగ టైగర్ నాగేశ్వర్‌ రావు జీవిత కథ నేపథ్యంలో వస్తోంది. రిలీజ్ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ భామ నుపుర్ సనన్‌ హీరోయిన్‌గా స్తుంది.

మరో కీలక పాత్రలో కోలీవుడ్ బ్యూటీ అనుకీర్తి వ్యాస్ నటిస్తుంది. అనుకీర్తి వ్యాస్ ఇందులో జయవాణి పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి జయవాణి లుక్ విడుదలైంది‌. సూపర్ హాట్ లుక్‌లో కనిపిస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది అనుకీర్తి వ్యాస్‌. ఈ సినిమాలో మలయాళ నటుడు సుదేవ్‌ నాయర్‌ కాశి పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో అనుపమ్‌ ఖేర్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా, మురళీ శర్మ విశ్వనాథ శాస్త్రిగా, సీనియర్‌ నటి రేణూదేశాయ్‌ హేమలత లవణం పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తుండగా.. టాలెంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu