HomeTelugu Reviewsరివ్యూ: జయమ్ము నిశ్చయమ్మురా

రివ్యూ: జయమ్ము నిశ్చయమ్మురా

నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ, జోగి బ్రదర్స్, కృష్ణ భగవాన్, రవివర్మ, కృష్ణుడు తదితరులు
సంగీతం: రవిచంద్రన్
సినిమాటోగ్రఫీ: నగేష్
ఎడిటింగ్: వెంకట్
నిర్మాత,రచన, దర్శకత్వం: శివరాజ్ కనుమూరి
శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా సతీష్ కనుమూరితో కలిసి స్వీయ దర్శకత్వంలో శివరాజ్ కనుమూరి
నిర్మిస్తున్న ”జయమ్ము నిశ్చయమ్మురా” చిత్రాన్ని శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలో గతంలో ‘గీతాంజలి’ సినిమా రూపొందినప్పటికీ హీరోగా పూర్తిస్థాయిలో
మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఏ మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి
తెలుసుకుందాం!

maxresdefault

కథ:
సర్వ మంగళం(శ్రీనివాస్ రెడ్డి) కరీంనగర్ లో తన తల్లితో కలిసి జీవిస్తూ ఉంటాడు. చదువు పూర్తి
చేసి ఉద్యోగం కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతడికి స్వామీజీలు, మూఢనమ్మకాలపై
ఉండే నమ్మకం తనపై తనకు ఉండేది కాదు. స్వామీజీ ఎలా ఆడిస్తే అలా ఆడేవాడు. ఉద్యోగం
కోసం కాకినాడ వచ్చిన సర్వ మంగళం, రాణి(పూర్ణ) అనే అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. తనను
పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని ఆశ పడతాడు. తనతో స్నేహం పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ..
ఉంటాడు. అలానే తన సొంతూరికి ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి తన బాస్ చెప్పిన ప్రతి పనిని
చేస్తూ ఉంటాడు. ఇంతలో తన బాస్ రాణిని వలలో వేసుకున్నాడని తెలుస్తుంది. చెడ్డ ఉద్దేశంతోనే
తన బాస్ అలా చేస్తున్నాడని తెలుసుకొని తనలో తను కుమిలిపోతాడు. ప్రేమించిన అమ్మాయికి
తన ప్రేమ విషయం చెప్పలేక, ఇటు బాస్ చేసే చెత్త పనులు చూస్తూ.. ఉండలేని పరిస్థితుల్లో
ఇరుక్కుపోతాడు. చివరకు ఏం జరిగింది..? ఆ సమస్యలన్నింటినీ సర్వ మంగళం ఎలా ఎదుర్కొన్నాడు..?
రాణి ప్రేమను పొందగలిగాడా..? తన సొంతూరికి ట్రాన్స్ఫర్ చేయించుకోగలిగాడా..? అనే విషయాలతో
సినిమా నడుస్తుంది.
ప్లస్ పాయింట్స్:
శ్రీనివాస్ రెడ్డి
కథ
సినిమాటోగ్రఫీ
సంగీతం
మైనస్ పాయింట్స్:
సాగతీత
ఫస్ట్ హాఫ్

image002
విశ్లేషణ:
అల్పజీవి అనే నవలలో ఓ పాత్ర ద్వారా స్పూర్తి చెంది డైరెక్టర్ ఈ కథను సిద్ధం చేసుకున్నట్లు
తెలుస్తోంది. తెలివి, ధైర్యం అన్నీ ఉన్న ఓ యువకుడు కొన్ని నమ్మకాలు, భయాలు వలన ఎలా
తన జీవితాన్ని లీడ్ చేయగలిగాడు. తనకు వచ్చిన సమస్యలను తనే ఒంటరిగా ఎలా ఎదుర్కొన్నాడు.
ఇదే కాన్సెప్ట్ ను సినిమాగా తెరకెక్కించాడు దర్శకుడు శివరాజ్. తనకు ఇది మొదటి సినిమా
అయినా.. కథను కాస్త ఎంటర్టైనింగ్ వే లో చెప్పడానికి ప్రయత్నించాడు. కొన్ని చోట్ల ఆ కామెడీ
శృతిమించి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కు దారి తీసిందనే చెప్పాలి. సినిమా మొదటి భాగంలో
చాలా సేపటి వరకు కథలోకి వెళ్లకపోవడం కథలోకి ఎంటర్ అయిన తరువాత దాని చుట్టూ
అనవసరపు సన్నివేశాలు జోడించడం కథను పక్క దారికి పట్టేలా చేసింది. ఉన్నంత వరకు
ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా.. కాకినాడ, భీమిలి వంటి లొకేషన్స్ ను చూపిస్తూ.. సినిమాను
ఆహ్లాదకరంగా తెరకెక్కించడానికి ప్రయత్నించాడు. శ్రీనివాస్ రెడ్డి రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో
చక్కగా నటించాడు. సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు. సినిమా మొత్తం అతడి
చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. పూర్తి స్థాయి హీరోగా అతడి పాత్రకు న్యాయం చేశాడు. పూర్ణ
ఈ సినిమా మొత్తం సాధారణ అమ్మాయిగా సంప్రదాయకంగా కనిపించింది. అందంగా కూడా
కనిపించింది. పోసాని కృష్ణ మురలి, ప్రవీన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్. అలానే రవిచంద్రన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా.. ‘ఓ రంగుల చిలక’
అనే పాట ఆకట్టుకుంటుంది. సినిమా నిడివి పెంచడానికి అన్నట్లు అనవసరపు సన్నివేశాలను
జోడించారు. వాటిని ట్రిమ్ చేస్తే ఇంకా బావుండేది. మొత్తానికి అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగే
చక్కటి ఆహ్లాదకరమైన సినిమా.

Recent Articles English

Gallery

Recent Articles Telugu