యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల అయ్యింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. పల్లెటూరి నేపథ్యంలో తెరక్కెకిన ఈసినిమాలో సుమ జయమ్మ పాత్రలో అదరగొట్టినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఆమె డైలాగ్ డెలీవరీ ఆకట్టుకుంటుంది. కాగా చాలా కాలం తర్వాత సుమ ప్రధాన పాత్రలో నటించిన సినిమా కావడంపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మించారు. మే6న ఈ సినిమా రిలీజ్ కానుంది.