టాలీవుడ్‌లో నితిన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ‘జయం’. నేటితో.. జయం చిత్రానికి ఇరవైఏళ్ళు. 2002 జూన్ 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించింది. మొదటి సినిమాతో నితిన్‌కు మంచి క్రేజ్ వచ్చింది. అప్పటికే వరుస విజయాలతో స్పీడు మీదున్న తేజకు ఈ చిత్రం మరింత బూస్టప్ ఇచ్చింది. ఈ చిత్రంలో గోపిచంద్ విలనిజంకు గొప్ప ప్రశంసలు అందుకున్నాడు. హీరోయిన్ సదా కూడా ఈ చిత్రంతోనే సినీరంగానికి పరిచయమైంది. కాగా జయం సినిమా ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నితిన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
‘ఇరవై సంత్సరాల క్రీతం ఇదే రోజు నా మొదటి చిత్రం జయంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించాను. నాలోని నటుడిని గుర్తించి, నాకు మొదటి బ్రేక్ ఇచ్చిన తేజ గారికి హృదయపూర్వక ధన్వవాదాలు. ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమా దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది అందరికి ధన్యవాదాలు. మీరు లేకుండా నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాడ్ని కాదు. నా ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నన్ను ఇంతగా ఆధరిస్తున్న నా అభిమానులకు ధన్యవాదాలు’ అంటూ ఎమోషనల్ నోట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నితిన్ ప్రస్తుతం ‘మాచర్ల నియోజకవర్గం’ అనే మాస్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.
https://www.instagram.com/p/CexW5l2PqkJ/?utm_source=ig_web_copy_link