సెప్టెంబర్ 22వ తేదీన జ్వరం సమస్యలతో ఆమె ఆసుపత్రిలో చేరిన జయలలిత అప్పట్నించి
ఆసుపత్రి నుంచి కాలు బయటికి పెట్టలేదు. చాలా రోజులు ఆమెకు ఐసీయూలో చికిత్స
చేశారు. లండన్, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి నిపుణులైన డాక్టర్లను రప్పించారు. వారి పర్యవేక్షణలో
చికిత్స చేశారు. ఇటీవలే ఐసియు నుంచి రూముకు మార్చారు. ఇంతలో మళ్లీ ఆమెకు
గుండెపోటు రావడంతో చెన్నై అపోలో ఆస్పత్రిలోని రూము నుంచి ఐసీయు కు తరలించారు.
అలా గుండెపోటు సమస్యతో బాధ పడిన జయలలిత సోమవారం రాత్రి 11.30 గంటలకు చెన్నైలోని
అపోలో హాస్పిటల్ లో తుది శ్వాస విడిచినట్లు డాక్టర్స్ పేర్కొన్నారు. దీంతో తమిళనాడులో
ఏడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. తమిళనాడు సీఎం గా పన్నీర్ సెల్వం
బాధ్యతలు స్వీకరించారు. జయలలిత మృతి పట్ల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు
సంతాపం తెలిపారు.