బాలీవుడ్ సీనియర్ నటి, ఎంపీ జయా బచ్చన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లోకి వెళ్లి తర్వాత సినిమాల్లో తక్కువగా కనిపించిన జయా బచ్చన్ ఏడేళ్లుగా వెండితెరపై కనిపించనేలేదు. ఇప్పుడు మళ్లీ ఓ మరాఠీ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఆమె తొలి మరాఠీ చిత్రం అంటున్నారు. దీనికి గజేంద్ర అహిరే దర్శకత్వం వహించనున్నట్లు టాక్. ఇతడు మరాఠీలో సుమారు 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే జయాబచ్చన్ హిందీలోని పలు సినిమాల్లో తన నటనతో అభిమానులను కట్టిపడేశారు.