HomeTelugu Trendingపెదకాపు: జాతర సాంగ్‌ ప్రోమో

పెదకాపు: జాతర సాంగ్‌ ప్రోమో

Jathara song promo from Pedశ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘పెదకాపు’. ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత మిర్యాల రెడ్డి మేనల్లుడు హీరోగా డెబ్యూ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై మంచి క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.

తాజాగా చిత్రబృందం ఈ సినిమా నుంచి మ్యూజికల్‌ అప్‌డేట్‌ను ప్రకటించింది. జాతర అంటూ సాగే మాస్సీయెస్ట్ సాంగ్‌ ప్రోమోను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇక ఈ పాట ఫుల్‌ లిరికల్‌ వీడియోను సెప్టెంబర్‌ 17న సాయంత్రం 6 గంటలకు రిలీజ్‌ చేయబోతున్నట్లు వెల్లడించారు. శ్రీకాంత్‌ అడ్డాల ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో కూడా కనిపించాడు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చిన ఈసినిమాను ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవిందర్‌ రెడ్డి నిర్మించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu