karthi: తమిళ నటుడు కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జపాన్’. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీ- కనకరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా ఇది. మొదటి సినిమా ఖైదీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాతే వచ్చిన ఈ నిరాశను మిగిల్చింది.
తమిళంతోపాటు తెలుగులోనూ మంచి అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. నటనపరంగా కార్తీ మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఈ మూవీ కమర్షియల్ గా అంతగా హిట్ కాలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు టాక్. విడుదలై నెలరోజులు గడవకముందే జపాన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.
డిసెంబర్ 1 న లేదా 8న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.త్వరలోనే ఈ విషయాన్ని అనౌన్స్ చేయనున్నట్లు తెలస్తోంది. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించింది. సునీల్, విజయ్ మిల్టన్ కీలకపాత్రలు పోషించారు.