లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ‘కొలమావు కోకిల’ సినిమాలో బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ మంచి హిట్టయింది. ఈ చిత్రాన్ని ‘కోకో కోకిల’ పేరుతో తెలుగులోకి రీమేక్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక నయనతార పాత్రను హిందీ వెర్షన్‌లో జాన్వీ కపూర్ పోషించనున్నట్టు సమాచారం. ‘కొలమావు కోకిల’లో నయనతార పాత్ర పెర్ఫార్మెన్స్ తో కూడిన పాత్ర. ఆమెకు ఎంతో పేరు కూడా తెచ్చిపెట్టింది. జాన్వీకి కెరీర్ పరంగా ఇది ఎంతో హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు.