శ్రీదేవి నటవారసురాలిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఆ క్రమంలోనే జాన్వీ అంతే ఉత్సాహంగా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతోంది. తాజాగా క్యూ అండ్ ఏ సెషన్స్ లో ఓ అభిమాని తనని ముద్దు అడిగాడు. మేము ముద్దు పెట్టుకోవచ్చా? అన్న ఆ ప్రశ్నకు సమాధానంగా జాన్వీ స్పందిస్తూ.. తాను ముసుగు ధరించి ఉన్న ఫొటోను పోస్ట్ చేసి.. ‘లేదు'(కుదరదు).. అంటూ చిలిపిగా ఆన్సర్ చేసింది. మహమ్మారీ ఉన్నప్పుడు ముద్దులకు చోటు లేదు! అన్నది జాన్వీ ఆన్సర్. ఈ ప్రశ్నతో పాటు ఫ్యాన్స్ నుంచి చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. అన్నిటికీ ఓపిగ్గా సమాధానాలిచ్చింది.
ఒకరు డైట్ గురించి ప్రశ్నిస్తే.. చేతిలో ఒక కప్పు ఐస్ క్రీంతో తన ఫొటోను పంచుకోవడమే గాక..రోజుకు 4 స్కూప్స్ మాత్రమే అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మరొకరు తనకు ఇష్టమైన జ్ఞాపకం గురించి అడిగితే.. కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ కోసం దక్షిణాన రోడ్ ట్రిప్పింగ్ వెళ్లడం.. అని చెప్పింది. తన అభిమాన సహనటుడు ఎవరు అని ప్రశ్నిస్తే..గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ సహనటుడు పంకజ్ త్రిపాఠిని కౌగిలించుకునే ఫొటోను షేర్ చేసింది. అలాగే ఆందోళన తగ్గాలంటే.. అనే వేరొక ప్రశ్నకు సమాధానంగా.. ఒక దిండును కౌగిలించుకొని విచారకరమైన పాటలు పాడమని సలహా ఇచ్చింది.