1999 కార్గిల్ యుద్ధంలో గాయపడ్డ సైనికుల్ని అత్యంత సాహసోపేతంగా సురక్షిత ప్రాంతాలకు తరలించిన భారత ఎయిర్ ఫోర్స్ మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్ రానుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వి కపూర్ నటించనున్నారని వార్తలు వచ్చాయి. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై చిత్ర బృందం స్పందించలేదు.
కాగా జాన్వి గుంజన్ గెటప్‌లో ఉన్న ఫొటో ఒకటి లీక్ అయ్యింది. దీంతో జాన్వి ఈ బయోపిక్‌లో నటిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజమేనని తేలింది. జాన్వి లుక్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె గుంజన్‌గా బాగా సరిపోయారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం జాన్వి ‘తఖ్త్’ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించారు. ‘యే దిల్ హై ముష్కిల్’ తర్వాత కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇందులో జాన్వితోపాటు కరీనా కపూర్, ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2020లో ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.