బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ తిరుమల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. శనివారం తిరుమల చేరుకున్న ఆమె ఆదివారం వేకువజామున స్వామి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ పరిసరాల్లో జాన్విని చూసిన అభిమానులు ఆమెతో ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు. తరచుగా తిరుపతి శ్రీవారి ని దర్శించుకునేందుకు వచ్చే జాన్వీ కపూర్ వచ్చిన ప్రతి సారి కూడా అందంగా పద్దతైన తెలుగు అమ్మాయిగా లంగా ఓనీ లేదా చీర అది కాదంటే పద్దతైన చుడిదార్ ను మాత్రమే ధరిస్తుంది. జాన్వీ కపూర్ ఈసారి పింక్ ఓనీ తో పాటు గోల్డ్ కలర్ లంగా మరియు బ్లౌజ్ లో మెప్పించింది. పక్కింటి అమ్మాయి అన్నంతగా ఫీల్ ను కలిగించింది.
జాన్వీ కపూర్ ను ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిందే అని నెటిజన్లు ప్రశంసలు చేస్తున్నారు. టీవీ సెలబ్రెటీలు కూడా ఈమద్య కాలంలో దేవాలయానికి వెళ్లిన సమయంలో తమ సెలబ్రిటీ స్టేటస్ ను చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాని జాన్వీ మాత్రం చాలా సింపుల్ గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తోంది. త్వరలో తెలుగు లో ఒక సినిమాను ఈమె చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. నటి శ్రీదేవికి తిరుమలతో ప్రత్యేక అనుబంధం ఉంది. సినిమా, వ్యక్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నా ప్రతి ఏడాది ఆమె తిరుమల దర్శనానికి వచ్చేవారు. తన తల్లిలానే తనకీ తిరుమల అంటే ఎంతో ఇష్టమని.. స్వామి సన్నిధిలోనే తాను పెళ్లి చేసుకుంటానని జాన్వి ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు.