హీరోయిన్ జాన్వీ కపూర్ తన కొత్త సినిమా ప్రయాణం ఏ ఆటంకం లేకుండా సవ్యంగా సాగిపోవాలని ప్రార్థిస్తున్నారు. కార్తీక్ ఆర్యన్, లక్ష్య, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించనున్న హిందీ చిత్రం ‘దోస్తానా 2’. ఈ సినిమాకు కొల్లిన్ డి కున్హా దర్శకుడు. 2008లో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం, ప్రియాంకా చోప్రా నటించిన ‘దోస్తానా’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమా చిత్రీకరణ పంజాబ్‌లో ప్రారంభం కానుంది. చిత్రీకరణకు ముందు కాస్త సమయం దొరకడంతో అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను దర్శించుకున్నారు జాన్వీ కపూర్. ‘దోస్తానా 2’ చిత్రాన్ని బాలీవుడ్ బడా దర్శక–నిర్మాత కరణ్‌జోహార్ నిర్మిస్తారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది