HomeTelugu TrendingJanhvi Kapoor to Shruti Haasan: ఆ తారల టాటూ వెనుక సీక్రెట్‌?

Janhvi Kapoor to Shruti Haasan: ఆ తారల టాటూ వెనుక సీక్రెట్‌?

Janhvi Kapoor to Shruti Haasan

Janhvi Kapoor to Shruti Haasan: ప్రస్తుతం ఫ్యాషన్‌ని బాగా ఫాలో అవుతున్నారు. ఫ్యాషన్‌ కోసమో, నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనో, ఇష్టమైన వారి మీద ప్రేమతోనో.. ఇలా కారణమేదైనా టాటూతో ఆకట్టుకుంటున్నారు. టాటూ అంటే ఏదో ఒక చోట వేసుకోవడం కాదు.. ఒంటి నిండా వేసుకుంటున్నారు. సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకూ ప్రస్తుతం ఇది ట్రెండ్‌ అయిపోయింది. సెలబ్రెటీల సంగతి అయితే చెప్పానవసరం లేదు. అయితే కొందరు సెలబ్రిటీల టాటూ వెనుక సీక్రెట్‌ ఏమిటో తెలుసుకుందాం..

జాన్వీ కపూర్‌: మా అమ్మంటే నాకెంత ఇష్టమో మాటల్లో వర్ణించలేను. నన్ను అమ్మ ముద్దుగా లబ్బూ అని పిలుస్తుండేది. ‘ఐ లవ్‌ యూ మై లబ్బూ.. యూ ఆర్‌ ది బెస్ట్‌ బేబీ ఇన్‌ ది వరల్డ్‌’ అని ఓసారి ఒక కాగితం మీద రాసిచ్చింది. అమ్మ చేతి రాతతో రాసిచ్చిన ఆ పద నా చేతిపై ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండేలా ‘ఐ లవ్‌ యూ మై లబ్బూ’ అని శాశ్వతంగా టాటూ వేయించుకున్నా. అందుకే ఆ టాటూ నాకు ఎంతో స్పెషల్‌. దాన్ని చూసిన ప్రతీ సారీ అమ్మ నాతోనే ఉన్నట్లనిపిస్తుంది.

రష్మికా మందన్నా: ఇష్టమైన వారి మీద ప్రేమను చూపించేందుకు అందరూ పచ్చబొట్లు వేసుకుంటే… నేను మాత్రం ఆడవాళ్లు ఎందులోనూ తక్కువకాదని నిరూపించేందుకు వేయించుకున్నా. కాలేజీ చదువుతున్న రోజుల్లో ఒక అబ్బాయి అమ్మాయిలను కించపరుస్తూ మాట్లాడాడు. అమ్మాయిలు అన్నింటికీ భయపడతారు. ముఖ్యంగా సూదులను చూస్తేనే ఏడవడం మొదలెడతారని అన్నాడు. అతడికి ఎలాగైనా అమ్మాయిల శక్తి ఏంటో చూపించాలనుకున్నా. వెంటనే చేతిపై టాటూ వేయించుకుందామని ఫిక్స్‌ అయ్యా. ప్రపంచంలో ఏ మనిషి ఇంకొకరిని రీప్లేస్‌ చేయలేరు. ఎవరి గుర్తింపు వారిది. అందుకే ‘ఇర్రిప్లేసిబుల్‌’ అని టాటూ వేయించుకున్నా.

శృతిహాసన్‌: టాటూలంటే నాకు పిచ్చి. పంతొమ్మిదేళ్ల వయసులో మొదటిసారి టాటూ వేయించుకున్న. ఒకవేళ నటిని కాకుంటే ముఖం మీద తప్ప ఒంటి నిండా టాటూలు పొడిపించుకునేదాన్ని. ఇక నా టాటూల విషయానికొస్తే… వీపు పై భాగంలో తమిళంలో నా పేరుతో పాటు దానిపైన కుమారస్వామి ఆయుధం అయిన వేలాయుధం గుర్తును టాటూ వేయించుకున్నా. మురుగన్‌ వేల్‌కు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. అందుకే పచ్చబొట్టు ద్వారా నా భక్తిని ప్రదర్శించాలనుకున్నా. అలాగే కొత్త ప్రారంభానికి ప్రతీకగా ఎడమ చేయి మణికట్టు మీద గులాబీని పచ్చబొట్టుగా వేయించుకున్నా.

ఫరియా అబ్దుల్లా: టాటూలు నా వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. నా కాలి మడమ వద్ద చెట్టు వేర్లు మాదిరిగా ఉన్న టాటూ ఉంటుంది. నేను పర్సనల్‌గా నమ్మేది ఏంటంటే… వేర్లు ఎంత బలంగా ఉంటే అంత ఎత్తుకు ఎదగగలం అన్నమాట. ప్రత్యేకించి సెలబ్రిటీ లైఫ్‌లో ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం చాలా అవసరం. ఆ విషయన్ని పదే పదే నాకు గుర్తు చేయాలనే ఆ టాటూ వేయించుకున్నా. నాకు ఆర్ట్‌ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అందుకే చేతి వేలిపై మోర్స్‌కోడ్‌లో ఆర్ట్‌ అని పచ్చబొట్టు పొడిపించుకున్నా. ఇక చేతిపై ‘వచ్చాం.. చూశాం.. సాధించాం’ అని లాటిన్‌ భాషలో అర్థం వచ్చేలా మరో టాటూ వేయించుకున్నా.

శ్రద్ధా శ్రీనాథ్‌: పద్దెనిమిదేళ్ల వయసులోనే ఒక అబ్బాయి కోసం టాటూ వేయించుకున్నా. అప్పట్లో బీటల్స్‌ అనే మ్యూజిక్‌ బ్యాండ్‌ ఒకటుండేది. దానిని నాకు పరిచయం చేసింది అతడే. నా టాటూపై ఉన్నది ఆ బ్యాండ్‌ ఆల్బమ్‌ కవరే. దాని అర్థం ప్రేమ. అలా నా రెండు ఇష్టాలను కలిపి టాటూ వేయించుకున్నా. తెలిసీతెలియని వయసులో నా ఫస్ట్‌ క్రష్‌ కోసం వేయించుకున్న ఆ టాటూ నాకు ఎప్పటికీ ప్రత్యేకమే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu