HomeTelugu Trendingతన ఫస్ట్‌ బ్రేకప్‌ గురించి చెప్పిన జాన్వీ కపూర్‌

తన ఫస్ట్‌ బ్రేకప్‌ గురించి చెప్పిన జాన్వీ కపూర్‌

Janhvi Kapoor talks about h

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తరచుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి ఆలయ అధికారులు.. ఆమెకు ఎప్పటిలాగే దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అయిపోయాక రంగనాయకుల మండపంలో వేదపండితులందరు కలిసి ఆమెకు అశీర్వచనం చేసి స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.

జాన్వీ ఎప్పుడు తిరుపతికి వెళ్లిన ఆమె ట్రెడిషనల్ గా లంగాఓణిలో కనిపిస్తుంది. అలాగే తాజాగా ఓ టాక్‌షోలో పాల్గొన్న జాన్వీ.. తన మొదటి బాయ్ ఫ్రెండ్‌తో రిలేషన్ షిప్ ను ఎందుకు బ్రేక్ చేయాల్సి వచ్చిందో కూడా తెలిపింది. నేను, నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్‌ సీక్రెట్ గా మీట్ అయ్యే వాళ్లం. ఒకరితో ఒకరం ఎన్నో అబద్ధాలు కూడా చెప్పుకునేవాళ్లం. ఓ సారి నా టైమ్ బాగోలేక నేను చెప్పిన ఓ అబద్ధం తెలిసిపోయింది. ఆ కారణంగా ఆ రిలేషన్ బ్రేక్ అయిపోయింది.

అయినా నాకు బాయ్ ఫ్రెండ్‌ ఉండకూడదని నా తల్లిదండ్రులు కూడా చెప్పారు. వాళ్లతో సిన్సియర్ గా ఉంటే అన్నీ పరిస్థితులు ఈజీగా మారుతాయని అర్థమైంది. వారి నిర్ణయాలకు తగ్గట్టుగా నడుచుకుంటే భవిష్యత్తు బాగుంటుందనేది నా అభిప్రాయం అని జాన్వీ చెప్పుకొచ్చింది. అయితే తన బ్రేకప్ ఎప్పుడు జరిగిందో క్లారిటీ ఇవ్వలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu