బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి కూతుర్లు జాన్వీ కపూర్ తన చెల్లి ఖుషీ కపూర్ ఇటీవలే ‘కాఫీ విత్ కరణ్’ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా జాన్వీ చెప్పిన కొన్ని సమాధానాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
‘ఎప్పుడైనా రొమాంటిక్ మెసేజ్‌లు వచ్చాయా?’ అని కరణ్ అడగ్గా.. ‘దీనికి సమాధానం చెబితే ఖుషీ నన్ను ఏడిపిస్తుంది’ అని సరదాగా చెప్పింది. ఎవరితో డేటింగ్ చేస్తారు..? అని ప్రశ్నించగా.. ‘సినిమా వాళ్లతో మాత్రం చేయను. డేటింగ్ చేసేవాళ్లకు నేనే ప్రపంచమై ఉండాలి.
ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలి. సినీ రంగంలో చాలా ఒత్తిడి ఉంటుంది. ఒకే వృత్తిలో ఉండేవాళ్లు దాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టం’ అని చెప్పెంది. ఇక సినిమాల విషయానికొస్తే బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తుంది. ఇక టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తునన ‘దేవర’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది.
కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. జనవరి 8న ఈ సినిమా గ్లింప్స్ విడుదల కానున్నాయి. ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్ తరువాత నటిస్తున్న సినిమా మరియు జాన్వీ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాపై సర్వత్రం ఆసక్తి నెలకొంది. ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.