టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ’30వ’ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ రానున్న సంగతి తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు. కాగా ఈ సినిమా పూర్తిగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించనున్నాడు త్రివిక్రమ్. అందులో భాగంగా ఎన్టీఆర్ ఈ సినిమాలో రాజకీయ నాయకుడి వారసుడిలా నటించబోతున్నాడట. పర్ఫెక్ట్ ఫ్యామిలీ పొలిటికల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్కు జంటగా పూజాహెగ్డే, రష్మిక, సమంతల్లో ఎవరో ఒకర్ని ఎంపిక చేయనున్నారట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నారట అందులో ఒకరిని బాలీవుడ్ నుంచి తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అందుకోసం జాన్వీ కపూర్ పేరు బాగా వినిపిస్తుంది. అంతే కాదు దాదాపు ఆమెఈ సినిమాలో నటించడం ఖాయమని కూడా అంటున్నారు.