బాలీవుడ్‌లో ప్రస్తుతం ‘పుష్ప’రాజ్ హవా నడుస్తోంది. స్టార్ హీరోలతో పాటు హీరోయిన్లు సైతం ‘పుష్ప’రాజ్ కు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే సినిమాను వీక్షించిన పలువురు ప్రముఖులు, సినీ, క్రికెట్ రంగాల్లోని ప్రముఖులు ఐకాన్ స్టార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక బాలీవుడ్ స్టార్ కరణ్ జోహార్ అయితే ఏకంగా ‘ఆర్య’ నుంచే బన్నీకి ఫ్యాన్ ను అంటూ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను అభిమానులతో పంచుకున్నారు. ఇక తాజాగా జాన్వీ కపూర్ కూడా ‘పుష్ప’ రాజ్ కు ఫిదా అయినట్టు కన్పిస్తోంది.
నిన్న రాత్రి జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ‘పుష్ప’లో అల్లు అర్జున్ నటనపై ప్రశంసలు కురిపించింది. ‘పుష్ప : ది రైజ్’ నుంచి తాజా స్టిల్‌ను షేర్ చేస్తూ ‘ పుష్ప మైండ్ బ్లోన్’ అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు ‘పుష్ప’రాజ్ ప్రపంచంలోనే కూలెస్ట్ మ్యాన్ అంటూ బన్నీని ఆకాశానికెత్తేసింది. ఇప్పటికే బాలీవుడ్ లో మన హీరోలు విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా బీటౌన్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.