శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ మాత్రం తన పెళ్లి గురించి పలు ఆసక్తికర అంశాలును వెల్లడించింది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మనసులో మాట బయటపెట్టింది. తన డ్రీమ్ వెడ్డింగ్ గురించి చెప్పుకొచ్చింది. పెళ్లి తంతు రెండు మూడు రోజుల్లో ముగిసిపోవాలి. కాప్రి ఐల్యాండ్‌లో ఓ ప్రైవేట్ బోట్‌లో బ్యాచిలర్ పార్టీ చేసుకువాలి. తిరుపతిలో నా పెళ్లి చేసుకుంటాను. మెహందీ, సంగీత్ కార్యక్రమాలు చెన్నైలోని మైలాపూర్‌లో ఉన్న అమ్మ నివసించిన ఇంటిలో జరగాలి.
పెళ్లికి కాంచీవరం చీర ధరించాలనేది నా కోరిక’ అని చెప్పింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్… పెళ్లిలో జాన్వీ స్టైలిస్ట్ ఎవరో తెలుసా? తన చెల్లెలు ఖుషీనేనట! కాబోయేవాడు తెలివితేటలు ఉన్న వాడైతే చాలని చెప్పింది జాన్వీ. ఆమె ప్రస్తుతం ‘గుడ్ లక్ జెర్రీ’తో పాటు ఓ దక్షిణాది చిత్రం హిందీ రీమేక్‌లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది.