జనతా గ్యారేజ్ టీజర్ వచ్చేస్తోంది!
ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా జనతా గ్యారేజ్‌పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. దాంతో పాటు బిజినెస్ పరంగా కూడా క్రేజ్ సంపాదించుకొంది ఈ సినిమా. ఫస్ట్ లుక్ ద్వారా ఎన్టీఆర్ మెస్మరైజ్ చేయగలిగాడు. ఇప్పుడు అందరి దృష్టి టీజర్ పై పడింది. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా టీజర్ బయటకు వస్తుందేమో అనుకొన్నారు. కానీ.. రాలేదు. ఇప్పుడు జనతా గ్యారేజ్ టీమ్ టీజర్ కి సంబంధించిన ముహూర్తం ఫిక్స్ చేసింది. జులై 6న జనతా గ్యారేజ్ టీజర్ విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. అదే నెలలో పాటలను కూడా రిలీస్ చేయాలనుకుంటున్నారు. ఆగస్టు 12న జనతా గ్యారేజ్‌ని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. మరి టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి..!