జనసేన శ్రీకాకుళం జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నేతలకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. జనసేనకు విశేషంగా ఉన్న యువశక్తిని రాజకీయ శక్తిగా మార్చాలని నేతలకి సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో అన్ని కులాల వారు జనసేనని అభిమానిస్తున్నారని, కులాల మధ్య సయోధ్యని మరింత పెంచాల్ని అవసరం ఉందన్నారాయన. జిల్లాలో అభివృద్ది చెందుతున్న కులాల వారికి అండగా ఉంటూనే, వెనుకబడిన కులాల వారిని ముందుకి తీసుకువెళ్లాలన్నారు. పార్టీ వర్కింగ్ క్యాలెండర్‌కి రూపకల్పన చేస్తామని, దాన్ని జిల్లా కమిటీలు సమర్ధవంతంగా అమలు చేయాలని కోరారు. వ్యక్తిగత అజెండా కాకుండా పార్టీ అజెండాతో ముందుకి వెళ్లాలని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్, పార్టీ ప్రతినిధిగా బహిరంగంగా మాట్లాడేప్పుడు సంస్కారవంత మైన భాష మాట్లాడాలని పార్టీ కేడర్ కు సూచనలు చేశారు. జనవరి మాసాంతంలోగా ఉత్తరాంధ్ర జిల్లాలకి సంబంధించి ప్రాంతీయ పార్టీ సమావేశం నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు జనసేనాని.