జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై రెండుమూడు రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ముందస్తు ఎన్నికలు రావడం, సన్నద్ధత లేకపోవడంపై పోటీపై సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు. ముందస్తు కాకుండా వచ్చే ఏడాదే ఎన్నికలు వస్తే 23 స్థానాల్లో పోటీ చేయాలని ముందుగా అనుకున్నామని.. అలాగే మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని భావించామని పేర్కొన్నారు. ముందస్తుకు వెళ్లడంతో తమ పార్టీ పోటీ చేయడంపై సందిగ్ధత నెలకొందని వివరించారు. అయితే కొంత మంది స్వతంత్రం గా నిలబడతామని.. తమకు మద్దతు తెలపాలని కోరుతున్నారని పవన్ కల్యాణ్ చెప్పారు. వీటన్నింటిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని జనసేన అధినేత పవన్ స్పష్టం చేశారు.