జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ట్రైన్ టూర్‌పై ఆ పార్టీ శ్రేణులు కసరత్తు ప్రారంభించాయి.. బెజవాడ నుంచి తుని రైల్వేస్టేషన్‌లో పవన్ కల్యాణ్ దిగే వరకు మొత్తం టూర్‌లో జోష్ నింపేలా ఆయా రైల్వే స్టేషన్లలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ నేతలు.. బెజవాడ టూ తుని రైలు టూర్ లో ఏడు వర్గాల వారితో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు… రైల్వే పోర్టర్లు, మామిడి రైతులు, ఏటికొప్పాక బొమ్మల తయారీ దారులు, టెక్స్‌టైల్ కార్మికులు, చెరుకు రైతులు, విద్యార్థులతో మమేకం కానున్నారు పవన్ కల్యాణ్.
రేపు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సుమారు 4 గంటల పాటు రైలులోనే ప్రయాణం చేయనున్నారు పవన్. ట్రైన్ టూర్ కోసం ఇవాళే సాయంత్రానికే విజయవాడ చేరుకోనున్న జనసేన అధినేత. ఇక జనసేన విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పవన్ కల్యాణ్ ట్రైన్ టూర్ వివరాలు… విజయవాడలో 1.10కి ప్రారంభమై… నూజివీడు 1.59 గంటలకు, ఏలూరు 2.14 గంటలకు, తాడేపల్లిగూడెం 2.49కు, రాజమండ్రి 3.47కు, సామర్లకోటకు 4.29కు, అన్నవరానికి 4.55కు. తునికి 5.10కి చేరుకోనున్నారు.