ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. విభాగాల వారీగా ప్రజలకు ఏమేం చేస్తామో పేర్కొంది. రైతులకు రూ.8వేలు పెట్టుబడి సాయం, 60 ఏళ్ల పైబడిన రైతులకు పెన్షన్ ప్రకటించింది. రాయల సీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఇలా ప్రాంతాల వారీగా చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను పేర్కొంది. ఒకటి నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ లాప్‌టాప్‌లు పంపిణీ వంటివి మేనిఫెస్టోలో పొందుపరిచింది.
ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామని జనసేన హామీ ఇచ్చింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500 నుంచి రూ.3500 వరకు నగదు జమ వంటి సంక్షేమ పథకాలను ప్రకటించింది. పవన్ ఇంతకుముందే ప్రకటించినట్లుగా ఉద్యోగుల సీపీఎస్ రద్దు వంటి తదితర అంశాలను మేనిపెస్టోలో చేర్చారు. మొత్తం 96 హామీలను జనసేన పొందుపరిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే సంకల్పంతో ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు ఆ పార్టీ పేర్కొంది.
జనసేన మ్యానిఫెస్టో, ఆంధ్ర ప్రదేశ్ – 2019#JanaSenaManifesto
2/6 pic.twitter.com/zZ0vKGGY9O
— JanaSena Party (@JanaSenaParty) April 3, 2019
జనసేన మ్యానిఫెస్టో, ఆంధ్ర ప్రదేశ్ – 2019#JanaSenaManifesto
4/6 pic.twitter.com/xITnwmcnZ4
— JanaSena Party (@JanaSenaParty) April 3, 2019
జనసేన మ్యానిఫెస్టో, ఆంధ్ర ప్రదేశ్ – 2019#JanaSenaManifesto
6/6 pic.twitter.com/C8P2e2WcFx
— JanaSena Party (@JanaSenaParty) April 3, 2019