జనసేన పార్టీకి సీనియర్ నేత మారిశెట్టి రాఘవయ్య పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం పార్టీ కోశాధికారిగా పనిచేస్తున్న ఆయన.. తన రాజీనామా లేఖను అధినేత పవన్‌కల్యాణ్‌కు పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. మారిశెట్టి రాఘవయ్య ప్రజారాజ్యం పార్టీలోనూ కీలకంగా వ్యవహరించారు.