జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ..రాజధాని రైతుల వాణిని దేశం నలుమూలలా వ్యాపించేలా నినదిస్తానని అన్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని రైతులు, ఆడపడుచులు చేపట్టిన నిరాహార దీక్షలు, ఆందోళనలు 50 రోజులకు చేరుకున్నా వారిలో ఏమాత్రం సడలని ఉద్యమస్ఫూర్తి, శాంతియుత పంథా చూసి తెలుగువారంతా గర్విస్తున్నారని ఆయన అన్నారు. ఈ మేరకు పవన్ పేరుతో జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. రాజధాని నిర్మాణానికి నిస్వార్థంగా 33వేల ఎకరాల భూమిని ఆనాటి ప్రభుత్వానికి సమర్పించి ఇప్పుడు రోడ్డున పడిన రైతన్నకు సర్వదా అండగా ఉంటానని గతంలో మాటిచ్చానని పవన్ గుర్తుచేసుకున్నారు. ఈనెల 10వ తేదీ తర్వాత మరోసారి రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నట్లు తెలిపారు. రైతుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్న పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు.
10వ తేదీ తరవాత అమరావతి పర్యటన – JanaSena Chief @PawanKalyan pic.twitter.com/jf4hKsPLCi
— JanaSena Party (@JanaSenaParty) February 5, 2020