జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. పార్టీ కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టిన పవన్.. తొలి జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో మహిళలకు పెద్దపీట వేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలయ్యింది. దేశ రాజకీయాల్లో జవాబుదారీతనం.. యువత రాజకీయాల్లో బలమైన పాత్ర పోషించాలి.. మహిళాశక్తికి రాజకీయ సాధికారత అందించాలన్నలక్ష్యంతో పార్టీ కమిటీలను విడుదల చేశామన్నారు ఆ పార్టీ నేతలు.
పార్టీ అధ్యక్షుడి నేతృత్వలో కేంద్ర కమిటీ పనిచేస్తుంది. కేంద్ర కమిటీతో పాటూ ప్రెసిడెంట్ జనరల్అడ్మిని స్ట్రేషన్ డివిజిన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో అనేక ప్రజాపయోగ కౌన్సిల్స్, కమిటీలను నియమించారు. వీటిలో సుమారుగా 22 కమిటీల్లో మహిళలకు తొలి విడతగా చోటు కల్పించారు. నవ వయస్కులు, విద్యాధికులు, డాక్టర్లు, లెక్చరర్లు, లాయర్లు, ఐటీ నిపుణులు, గృహిణులు ఉన్నారు.
జనసేన పార్టీ కమిటీ వివరాలు:
* జనసేన పార్టీ మహిళా విభాగం- ‘వీర మహిళ’ ఛైర్మన్‌గా జవ్వాజి రేఖను నియమించారు. కర్నూలకు చెందిన రేఖ సీఏ ఫైనల్ విద్యార్థిని.
* వీర మహిళ ‘వైస్ ఛైర్మన్లు- భీమవరానికి చెందిన సింధూరి కవిత, షేక్ జరీనా-నర్సరావుపేట, నూతాటి ప్రియా సౌజన్య-రాజమండ్రి, శ్రీవాణి-హైదరాబాద్.
* పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సుజా పాండాకు స్థానం.
* క్యాంపైనింగ్ అండ్ పబ్లిసిటీ విభాగం ఛైర్మన్‌గా ఉష శ్రీ పెద్దిశెట్టి. విశాఖపట్నంకు చెందిన ఉష శ్రీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.
* సోషల్ మీడియా కో ఆర్డినేటర్‌గా నర్సాపురంకు చెందిన రజిత నియామకం.
* ఎలక్షనీరింగ్ విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన లోకం వర్షిణిని స్థానం.
* పబ్లిక్ హెల్త్ బాడీ కన్వీనర్‌గా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంకు చెందిన కొప్పుల నాగ మానస నియామకం.
* జై కిసాన్ వింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన లక్ష్మీకుమారి
* పార్టీ క్రమశిక్షణ కమిటీ వైస్ ఛైర్మన్‌గా అనంతపురంకు చెందిన పద్మావతి
* పాలసీ వింగ్ ఛైర్మన్‌గా డాక్టర్ యామిని జ్యోత్స కంబాల
అలాగే.. పార్టీ ఐడియాలజీ వింగ్ కమిటీలు.. పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీలు.. పార్లమెంట్ వర్కింగ్ కమిటీలు.. ప్రోటోకాల్స్ కమిటీ కోఆర్డినేటర్లు.. పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా వీర మహిళ విభాగం కన్వీనర్లను నియమించారు
ఆడపడుచులతో జనసేన పార్టీ కమిటీలు (2)
తొలి జాబితా విడుదల చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు pic.twitter.com/g4EdmRpvgW
— JanaSena Party (@JanaSenaParty) February 1, 2019
ఆడపడుచులతో జనసేన పార్టీ కమిటీలు (3)
తొలి జాబితా విడుదల చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు pic.twitter.com/vu3hEIQnuI
— JanaSena Party (@JanaSenaParty) February 1, 2019