ఏపీలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా జనసేన, బీజేపీ కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక నుంచి జరిగే కార్యక్రమాలన్నీ ఉమ్మడిగా చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈ మధ్యాహ్నం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీలోనే రెండు పార్టీలు కలిసి పనిచేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతిపై త్వరలోనే ఇరు పార్టీలు పూర్తిస్థాయి ప్రకటన విడుదల చేసే అవకాశముంది.