Homeతెలుగు Newsఅనంతపురంలో జనసేన కవాతు

అనంతపురంలో జనసేన కవాతు

రాయలసీమలో కరవు పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు అనంతపురం జిల్లాలో పవన్ కల్యాణ్ కవాతు నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 2న నిర్వహించ తలపెట్టిన కవాతు కోసం జనసేన పార్టీ ఓ వీడియోను విడుదల చేసింది. వలసలను తగ్గించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించేందుకు ఈ కవాతు నిర్వహిస్తున్నట్లు వీడియోలో వివరించారు. గుత్తి రోడ్డులోని మార్కెట్ యార్డు నుండి క్లాక్ టవర్ వరకు జనసేన కవాతు జరగనుంది.7 25

అంతరించిపోతున్న చేనేత కళకు ఆదరణ కల్పించడం, ఉపాధి లేక రోడ్డున పడుతున్న యువతకు అండగా నిలవడం లక్ష్యంగా జనసేన ఈ కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనసేన కవాతులో పాల్గొని రాయలసీమ సమస్యలపై పోరాడుతున్న పవన్‌కు మద్దతివ్వాలని ప్రజలను కోరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu