
Jana Nayagan non theatrical rights:
థలపతి విజయ్ తాజా చిత్రం “జన నాయకన్” ప్రేక్షకులను థ్రిల్లింగ్ యాక్షన్, పొలిటికల్ డ్రామాతో ఆకట్టుకోనుంది. హెచ్. వినోత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నిలుస్తుండగా, మమితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మెనన్, ప్రియమణి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. థియేటర్లలో జనవరి 9, 2026న గ్రాండ్ రిలీజ్ కానున్న “జన నాయకన్” ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 121 కోట్లకు డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు, సన్ టీవీ రూ. 55 కోట్లకు శాటిలైట్ హక్కులను పొందినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ డీల్ తమిళ సినిమాలో పెద్ద పోస్టు-థియేట్రికల్ ఒప్పందాల్లో ఒకటిగా నిలవనుంది.