హాలీవుడ్ స్టార్ టామ్ హాంక్స్, అతని భార్యకు కరోనా.. బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు చికిత్స పొందుతున్నారు. అయితే, ఇప్పుడు హాలీవుడ్ స్టార్ నటి, జేమ్స్ బాండ్ హీరోయిన్ ఓల్గాకు కూడా కరోనా సోకింది. ఇటీవలే ఆమెను జలుబు, దగ్గు, జ్వరం ఉండటంతో వైద్యం కోసం వెళ్లి టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను ప్రస్తుతం క్వారెంటైన్డ్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ను ఎవరూ కూడా తక్కువగా తీసుకోవద్దని, ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా కేర్ తీసుకోవాలని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. 2008 లో వచ్చిన క్వంటం ఆఫ్ సోలేస్, 2013 లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ సినిమా ఒబ్లీవియోన్ సినిమాలో కూడా ఆమె నటించారు.