జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ఎందుకు ఇంత నీచంగా ప్రవర్తిస్తోంది అని సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు మామాసికంగా కుమిలిపోతున్నాడు. అసలు జగన్ రెడ్డి అమరావతి విషయంలో ఎన్ని డ్రామాలు ఆడాడో చూద్దాం. మొదట CRDA చట్టాన్ని రద్దు చేసి మూడు రాజధానులు మా విధానం అని జగన్ రెడ్డి పదే పదే ప్రకటించాడు. అయితే రాజధానిని అమరావతి నుంచి తరలించటం అనేది రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని కాలరాయటమే. ఈ విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వం కోర్టులో ఓడిపోవటం దాదాపు లాంఛనమే. ఇది అర్ధం చేసుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కు తీసుకుంది. ఆ తర్వాత ఎప్పటిలాగే జగన్ రెడ్డి తన కూలీ మీడియాతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది.
అనంతరం జగన్ రెడ్డి ఓ ప్రణాళిక వేశాడు. మెరుగైన పదజాలంతో ఇదే రాజధాని తరలింపు చట్టాన్ని కోర్టుకి ఇంకొంచెం ఆమోదయోగ్యంగా అసెంబ్లీ లో మళ్ళీ ప్రవేశ పెట్టాలని ప్లాన్ వేసాడు. అయితే జగన్ రెడ్డి ప్రభుత్వ ఆశలపై నీళ్లు చల్లుతూ, అసలు శాసన సభకి రాజధాని మార్పుపై చట్టం చేసే అధికారమే లేదని హైకోర్టు ఆదేశించింది. దీంతో జగన్ రెడ్డి ప్రభుత్వం రక్షణలో పడిపోయింది. అలాగే ఆ సమయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా NV రమణ గారు ఉండటంతో జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిశ్శబ్దం పాటించింది. రమణ గారు విశ్రాంతులై పదవీ విరమణ చేసే వరకు ఆగి, ఇప్పుడు మళ్ళీ జగన్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఇక ఇప్పుడు ఏమి జరుగుతుందో సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. అయితే హైకోర్టు కొన్ని మరీ విపరీతమైన తీర్పులు ఇచ్చింది. నెలలో ఏవో పూర్తీ చేయాలి, 6 నెలల్లో రాజధాని పనులు పూర్తి కావాలి అని విడ్డూరమైన ఆజ్ఞలు చేసింది. సుప్రీమ్ కోర్ట్ ఇలాంటి అసంబద్ధమైన తీర్పులపై స్టే ఇచ్చింది. రైతుల న్యాయ బద్దమైన ఆశలని సుప్రీంకోర్టు సైతం విస్మరించజాలదు. వారికి ఆర్థిక నష్టం కలుగ నీయదు. అది రాజధానితో ఇస్తుందా, లేదా ఏమైనా ప్రత్యామ్నాయం చూపుతుందా? అనేది చూడాలి. ఒకవేళ ప్రత్యామ్నాయం చూపితే ఈ జగన్ రెడ్డి దానికి న్యాయం చేయగలడా ?. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆదాయం పక్కన పెట్టి, ఉన్న మార్గాలకు గండి కొట్టి, వచ్చే టాక్స్ డబ్బులు కూడా ఉచిత పథకాల కింద కాజేస్తున్నాడు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది అంటే.. కార్మికులకు పని లేక, వ్యాపారస్తులకు బిజినెస్ లేక చేతులు ఎత్తేశారు. మొత్తమ్మీద జగన్ రెడ్డి దెబ్బకు బీహార్ కన్నా వెనుక ఉంది ఆంధ్ర. అపుడే ఏముంది ? ఇంకో ఏడాదిలో ఆంధ్ర మొత్తం అప్పుల పాలు అయిపోయి, నిత్యావసరాల ధరలు పెరిగిపోయి, రాష్ట్రానికి ఉన్న ఆస్తులు అమ్మేసుకొని అందరూ తట్ట బుట్ట సర్దుకుని వెళ్ళే రోజు వచ్చినా ఆశ్చర్యం ఏమీ లేదు. ఆంధ్రల్లారా ఇప్పుడు మిమ్మల్ని మీరే కాపాడుకోగలరు. జరా జాగ్రత్త.