HomeTelugu Trending'జైలర్‌' ట్రైలర్‌ లో తమన్నా కనిపించలేదేంటీ!

‘జైలర్‌’ ట్రైలర్‌ లో తమన్నా కనిపించలేదేంటీ!

Jailer trailer Muthivel Pandians journey from innocence to destruction

సూపర్‌‌ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్ర ‘జైలర్’. సన్ పిక్చర్స్ బ్యానర్‌‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించారు. ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. షో కేస్ పేరుతో తెలుగు ట్రైలర్‌‌ను టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగ చైతన్య రిలీజ్ చేశాడు. పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ ట్రైలర్‌‌ సినిమాపై ఆసక్తిని ఇంకా పెంచేసింది. రజనీకాంత్ తన మార్కు నటన, డైలాగ్స్‌తో ఆకట్టునున్నారు.

‘ఈ డిసీజ్ వచ్చిన వాళ్లు పిల్లి పిల్లలా ఉంటారు.. కానీ ఒక్కోసారి పులిలా మారుతారు’ అంటూ డాక్టర్ బ్యాక్ గ్రౌండ్‌ వాయిస్‌ తో పరిచయమైన పాత్రలో రజనీకాంత్ తొలుత కుమారుడు, మనవడికి బూట్లు పాలీష్ చేస్తూ కనిపించారు. కానీ, ఆ తర్వాత విలన్స్‌ను చితక్కొడుతూ ‘ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు. కోతలే..’ అంటూ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్‌ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. అయితే ఈ ట్రైలర్‌లో తమన్నా కనిపించకపోవడంపై నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

‘వా కావాలయ్యా’ పాటతో సినిమా కు సూపర్‌ క్రేజ్ తెచ్చి పెట్టింది కానీ ట్రైలర్‌ లో మాత్రం చోటు సంపాదించుకోలేక పోయింది. దీంతో ఆమె పెద్దగా ప్రాముఖ్యమైన పాత్ర అయ్యి ఉండక పోవచ్చు అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా విడుదలైయ్యే వరకూ వేచి చూడాల్సిందే. ఈ మూవీలో రజనీకి భార్యగా రమ్యకృష్ణ, హీరోయిన్‌గా తమన్నా, విలన్‌గా జాకీష్రాఫ్ నటించారు. సునీల్, మలయాళ స్టార్ మోహన్‌లాల్‌, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, నాగబాబు ఇతర పాత్రలు పోషించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu