సూపర్‌స్టార్ రజినీకాంత్ జైలర్ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్ ఇంకా కొనసాగుతున్నాయి. ఈ చిత్రం కోసం పని చేసిన 300 మందికి పైగా వ్యక్తులకు నిర్మాత బంగారు కాయిన్లను అందించారు.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం జైలర్ బ్లాక్బాస్టర్ అయింది. కలెక్షన్ల సునామీ సృష్టించి చాలా రికార్డులను బద్దలుకొట్టింది.
ప్రపంచవ్యాప్తంగా రూ.650కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిన ఈ మూవీ ఆగస్టు 10న రిలీజైన జైలర్ మూవీ మొదటి రోజు నుంచి అంచనాలకు మించి వసూళ్లను రాబట్టింది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమా కోసం పని చేసిన వారికి జైలర్ చిత్ర నిర్మాత కళానిధి మారన్ బహుమతులు ఇస్తున్నారు.
జైలర్ చిత్రం కోసం పని చేసిన 300 మందికిపైగా వ్యక్తులకు బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చారు నిర్మాత కళానిధి మారన్. ఇందుకోసం ఓ ఈవెంట్‌ను నిర్వహించి వారికోసం మంచి విందు ఏర్పాటు చేశారు. భారీ కేక్ కట్ చేసి ఘనంగా సెలబ్రేట్ చేశారు.
బంగారు నాణేలు పంచిన తర్వాత నిర్మాత కళానిధి మారన్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ వారితో కలిసి కూర్చొని భోజనం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సన్ పిక్చర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 300 మందికిపైగా వ్యక్తులను గోల్డ్ కాయిన్లతో నిర్మాత సన్మానించారని పేర్కొంది.