
Jaideep Ahlawat remuneration:
‘పాతాళ్ లోక్ 2’ విడుదలైన తర్వాత, Jaideep Ahlawat (పారితోషికం గురించి పెద్ద చర్చ నడిచింది. ఆయన మొదటి సీజన్‌కి రూ. 40 లక్షలు తీసుకోగా, రెండో సీజన్‌కి రూ. 20 కోట్లు డిమాండ్ చేశారని వార్తలు వచ్చాయి. ఇది నిజమేనా?
ఈ వార్తలపై స్పందించిన జైదీప్, నవ్వుతూ “అబ్బా! నిజంగా అంతిచ్చారా? ఎవరో చెప్పి ఉంటే ఏమైనా చేసేవాడిని. ఈ డబ్బు ఎక్కడ ఉంది?” అంటూ సరదాగా చెప్పాడు. కానీ, ఆయన నిజంగా రూ. 20 కోట్లు తీసుకున్నారా అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.
జైదీప్ చెప్పినదాని ప్రకారం, ప్రముఖ నటుల పారితోషికం సమయానుసారం పెరుగుతుంటుంది. ‘పాతాళ్ లోక్’ 2020లో పెద్ద హిట్ అయ్యింది కాబట్టి, రెండో సీజన్‌కి ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకోవడం సహజమే. అయితే, నిజంగా 20 కోట్లు తీసుకున్నారా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
జైదీప్ ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్‌తో ‘జువెల్ థీఫ్’, అలాగే ‘ఫ్యామిలీ మ్యాన్ 3’లో విలన్ పాత్ర చేస్తోన్నాడు. ప్రతి సినిమాతోనూ తన అద్భుతమైన నటనను చాటుకుంటూ, ఇండస్ట్రీలో ఒక స్ట్రాంగ్ పేరు తెచ్చుకుంటున్నాడు.