HomeTelugu Big Stories'జై సింహా' కొత్త షెడ్యూల్ కు రెడీ!

‘జై సింహా’ కొత్త షెడ్యూల్ కు రెడీ!

బాలకృష్ణ-నయనతారల క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన “శ్రీరామరాజ్యం, సింహా” చిత్రాలు ఘన విజయం సొంతం చేసుకోవడమే కాక వారి కాంబినేషన్ సదరు సినిమాల సక్సెస్ లో కీలకపాత్ర పోషించింది. “సింహా” తర్వాత మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత “జై సింహా” చిత్రంలో బాలయ్యతో నయనతార జతకట్టడం విశేషం. నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున యాక్షన్ ఎంటర్ టైనర్ “జై సింహా”. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్దమవుతుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. “నవంబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు హైద్రాబాద్ లో జరిగే కొత్త షెడ్యూల్ లో పాటలు మినహా టాకీ పార్ట్ పూర్తవుతుంది. ఇప్పటివరకూ బాలయ్య కెరీర్ లో “సింహా” అనే టైటిల్స్ తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయినట్లుగానే.. “జై సింహా” కూడా సూపర్ హిట్ అవ్వడం ఖాయం. బాలకృష్ణ-నయనతారల కాంబినేషన్ ఎప్పుడూ కనులవిందుగా ఉంటుంది. “జై సింహా”లో వారి కాంబినేషన్ ఆసక్తికరంగా ఉండబోతోంది.” అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu