స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు సొమవారం పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ‘జై సేన’ చిత్రం టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు.’జైసేన.. జై సేన అంటూ సాగే ఈ పాటని పవన్ కళ్యాణ్ సోదరుడు, నటుడు నాగబాబు విడుదల చేశారు. ఈ చిత్రానికి వి. సముద్ర దర్శకత్వం వహించారు. శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృధ్వీ, ప్రవీణ్, కార్తికేయ, ప్రధాన పాత్రలు పోషించారు. వి సాయి అరుణ్ కుమార్ నిర్మతగా వ్యవహరిస్తున్నారు.
వి. సముద్ర సింహరాశి, శివ రామ రాజు, అధినేత, పంచాక్షరి తదితర చిత్రాల్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇటీవల ‘జై సేన’ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నా ప్రతి సినిమాలోనూ సామాజిక అంశాలు అన్నట్లుగానే ఇందులోనూ కొన్ని విషయాల్ని ప్రస్తావించాను. పవన్ కళ్యాణ్ భావాలతో పాటు ఆయన అభిమానులు చేసే మంచి ఇందులో చూపిస్తున్నాం. శ్రీకాంత్ , సునీల్‌తో పాటు నలుగురు కొత్త హీరోయిన్‌లు ఇందులో నటించారు’ అని తెలిపారు.